పాక్ నుండి మాజీ ప్రధానికి ఆహ్వానం

పాక్ నుండి మాజీ ప్రధానికి ఆహ్వానం

నవంబర్‌ 12న సిక్కు మతవ్యవస్థాపకుడు అయిన బాబా గురునానక్‌ 550వ జయంతి సందర్బంగా నవంబర్‌ 9న కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించాలని పాక్‌ నిర్ణయం తీసుకున్నది. కర్తార్‌పూర్‌ కారిడార్‌ని భారత్,పాకిస్తాన్‌ మధ్య మైలురాయి అనే భావన ఉంది.కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి ప్రస్తుత భారతప్రధాని మోదీకే ఈ ఆహ్వానం అందాల్సింది కాని భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను ఆహ్వానించాలని పాక్‌ నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్‌ 370 రద్దు కారణంగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ మోదీని కాదని మన్మోహన్‌ను ఆహ్వానిస్తున్నారు.

పాకిస్తాన్‌లో మన్మోహన్‌ను ఎంతో గౌరవం ఉంది, మతపరమైన విశ్వాసాలు కలిగి సిక్కు మతానికి చెందిన మన్మోహన్‌ సింగ్ను ఆహ్వానించడం సముచితమని పాక్‌ విదేశాంగమంత్రి ఖురేషి సమర్థించారు.

ఆహ్వానం అందితే  పదేళ్లు ప్రధానిగా ఉన్నప్పుడు ఎప్పుడూ పాక్‌లో అడుగుపెట్టని భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తిరస్కరించే అవకాశాలే ఎక్కువని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.