పాకిస్తాన్ లో మహిళా ఆర్టిస్టులపై ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయే తప్ప వాటికి అడ్డుకట్ట వేసే నాధుడు కనపడడం లేదు. పాక్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి-సింగర్ రేష్మ తన భర్త చేతిలో దారుణహత్యకు గురయ్యారు. పాక్‌లోని ఖైబర్ ఫంక్తుఖ్వాలో జరిగిన ఈ హత్య ఇప్పుడు పాక్ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. పలు సినిమాల్లో నటింఛి ఫేమస్ అయిన నటి రేష్మ గాయనిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు చంపినా వ్యక్తికి రేష్మ నాలుగో భార్య కాగా, వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో రేష్మ గత కొన్నిరోజులుగా నౌషెరా కలాన్ లోని హకిమాబాద్‌లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమెను కాల్చి చంపాలని ముందే ప్లాన్ చేసుకుని అక్కడికి వచ్చిన రేష్మ భర్త రేష్మని చూడగానే విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతని తూటాలకు ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోగా, నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, రేష్మ హత్య ఈ ఏడాది మహిళా ఆర్టిస్టులపై జరిగిన 15వ అఘాయిత్యం కావడం గమనార్హం.