Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడులో సినిమాలు, రాజకీయాలు కలగలసిపోయి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువమంది సీఎంలు సినీ రంగానికి చెందినవారే. ఇలాంటి సినిమా, రాజకీయ బంధం ఉన్న రాష్ట్రంలో కూడా 2009 నుంచి సినిమా అవార్డులు ఇవ్వడం లేదు. దీంతో స్పందించిన పళనిస్వామి.. తాను సీఎం కాగానే పాత అవార్డులన్నింటికీ దుమ్ము దులిపి అన్ని అవార్డులు ఒకేసారి ప్రకటించాడు.
అవార్డుల ప్రకటనపై సినీ పరిశ్రమలో హర్షం వ్యక్తమైనా.. స్టార్ హీరోలెవరికీ అవార్డులు రాకపోవడం చర్చనీయాంశమైంది. కేవలం అప్ కమింగ్ నటులకు మాత్రమే అవార్డులు దక్కాయి. స్టార్ డమ్ ఉన్న వాళ్లు ఎవ్వికీ దాదాపుగా అవార్డులు ప్రకటించలేదు. దీంతో తమను పిలిపించి అవమానించారని మరికొందరు నటులు ఎద్దేవా చేస్తూ వెళ్లిపోయారు.
కానీ సీఎం పళనిస్వామి మాత్రం ప్రతీకారం తీర్చుకున్నానని సంబర పడుతున్నారట. జల్లికట్టు ఉద్యమ సమయంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి, సెల్వాన్ని సపోర్ట్ చేసిన స్టార్ హీరోలందర్నీ గుర్తుపెట్టుకునే స్వామి ఇలా చేశారని చెన్నై టాక్. ఏది ఏమైనా సీఎం ఇలా అవార్డులిచ్చి మరీ కసి తీర్చుకోవడం ఏంటో..?
సాధారణంగా పేరు ప్రఖ్యాతులున్న చిత్ర ప్రముఖుల్ని ప్రభుత్వాలు టార్గెట్ చేయటం దాదాపుగా ఉండవు.