జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ మధ్య అధిష్టానం సయోధ్య కుదర్చడంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. నిన్న కార్యకర్తల సమావేశంలో పల్లాను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ముత్తిరెడ్డి ప్రకటించగా, పల్లా ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇద్దరూ స్వీట్లు తినిపించుకున్నారు. ఆ సమయంలో పల్లా మరోసారి ముత్తిరెడ్డి కాళ్లు మొక్కారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికు రావడం తో హరీష్ రావు సమక్షం లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ నెల 16వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో సీఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ నేపధ్యంలో జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశానికి హాజరు అవడం సంతోషంగా ఉందని ఈ సందర్బంగా హరీష్ రావు పేర్కొన్నారు.