జనగామ టికెట్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఖాయమైందంటూ ఆయన అనుచరులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి రంగులు చల్లుకున్నారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ప్రభుత్వం ఆర్టీసీ చైర్మన్ పదవి ప్రకటించడంతో పల్లాకు లైన్ క్లియర్ అయింది. అయితే తన పదవిపై ఇప్పటివరకు ముత్తిరెడ్డి స్పందించలేదు.
మరోవైపు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు రైతుబంధు సమితి పదవి ఇవ్వగా… ఆయన సైతం మౌనంగానే ఉండిపోయారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసంతృప్తులపై భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే పెండింగ్లో ఉన్న టికెట్లను ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే… తాటికొండ రాజయ్య మరియు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లకు కీలక పదవులు కట్టబెట్టారు సీఎం కేసీఆర్. మొన్నటి వరకు ప్రచారం జరిగినట్లుగానే తెలంగాణ ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని సీఎం కేసీఆర్ నియామకం చేశారు . అలాగే తెలంగాణ రైతుబంధు చైర్మన్ గా వల్ల రాజేశ్వర్ రెడ్డి పదవిని తాటికొండ రాజయ్యకు ఇచ్చారు