చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశమైన ఏపీ కేబినెట్.. పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. పల్లె వెలుగు స్వర్ణగ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పల్లె వెలుగు స్వర్ణగ్రామం పేరుతో పల్లెకు పోదాం అంటోంది ఏపీ ప్రభుత్వం. 2 రాత్రులు, 3 పగళ్లు IASలు ప్రజలతో మమేకమవ్వాలి. ప్రజాప్రతినిధులు కూడా నెలకు 4 రోజులు పల్లె నిద్ర చేసి పల్లెల్లో సమస్యలు పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం..