‘పంతం’ బిజినెస్‌ బాగానే అయ్యిందే!

Pantham Movie Pre-Release Business

గోపీచంద్‌ 25వ చిత్రం ‘పంతం’ విడుదల అయ్యింది. చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా మెహ్రీన్‌ నటించింది. గోపీచంద్‌కు ప్రతిష్టాత్మక చిత్రం అయిన పంతంకు మంచి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగినట్లుగా సమాచారం అందుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకు నిర్మాత 20 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా అన్ని ఏరియాలు కలిపి ఈ చిత్రం 14.5 కోట్లు రాబట్టింది. ఇక ఆన్‌ లైన్‌ రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌, ప్రైమ్‌ వీడియో రైట్స్‌, ఆడియో రైట్స్‌ ఇలా పలు రైట్స్‌తో మరో అయిదు కోట్ల వరకు నిర్మాత ఖాతాలో పడే అవకాశం ఉంది.

నిర్మాత పెట్టిన పెట్టుబడి విడుదలకు ముందే రావడం జరిగింది. గోపీచంద్‌ ఈమద్య కాలంలో నటించిన ఏ సినిమాలకు ఇలాంటి బిజినెస్‌ జరిగింది లేదు. గోపీచంద్‌ గత చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కూడా గోపీచంద్‌ కెరీర్‌లో ఇది 25వ చిత్రం అవ్వడంతో పాటు, టీజర్‌ మరియు ట్రైలర్‌, పోస్టర్‌లు ఆకట్టుకున్నాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. నైజాం మరియు సీడెడ్‌ ఏరియాల్లో ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తప్పకుండా వారికి లాభాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద మంచి సినిమాలు ఏమీ లేవు.