వేలు పట్టుకొని నడిపించిన నాన్న లేడు.. ఆకలి వేస్తే తినిపించే అమ్మ లేదు.. ఉండడానికి ఇల్లు లేదు.. చదువుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు.. అమ్మానాన్న వైద్యం కోసం చేసిన అప్పులు మిగిలాయి.. అనారోగ్యంతో తండ్రి, కరోనాతో తల్లి మృతిచెందగా ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. భవిష్యత్ అంధకారమైంది.
ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తున్నారు. మల్యాల మండలం ఒబులాపూర్ గ్రామానికి చెందిన గాదె శ్యాంసుందర్ తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి భార్య లావణ్య ఒకవైపు బీడీలు చేస్తూ, మరోవైపు బీడీల కంపెనీ నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఆమెను ఇటీవల కరోనా బలి తీసుకుంది. దీంతో ఇద్దరు పిల్లలు దిక్కులేనివారయ్యారు.