ముకుమ్మడిగా అధికారులు డుమ్మా కొట్టిన సంఘటన వికారాబాద్ జిల్లాలో పరిగి తహశీల్దార్ కార్యాలయంలో జరిగింది.పెద్ద స్దాయి అదికారి తహశీల్దార్ నుంచి చిన్న స్దాయి అధికారి వరకు ఎవరు లేకపోవడం గమనార్హం. ఒక్కసారిగా అందరు గైర్హాజరు కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న జరిగిన రిజిస్ట్రేషన్ పై పలు ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దాదాపు 45 కోట్ల విలువ భూమి పై రాజకీయ నాయకుల కన్ను పడినట్టు తెలుస్తోంది. అసలు సీలింగ్ లో ఉన్న భూమి రీలిజ్ ఎలా అయ్యిందని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. తహశీల్దార్ కార్యాలయంలో కాకుండా రిజిస్ట్రేషన్ బయట చేశారని ఆరోపణలు చేశారు. తహశీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ జరిగిందని ఓ అధికారి పేర్కొంటున్నారు. కానీ సీసీ ఫుటేజ్ అడిగితే మాత్రం సమాధానం చెప్పడం లేదని గ్రామస్థుల ఆరోపిస్తున్నారు.వికారాబాద్ జిల్లాలో పరిగి తహశీల్దార్ కార్యాలయంలో నిన్న ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
పరిగి మండలంలోని రాఘవాపూర్ గ్రామానికి చెందిన 22 ఎకరాల భూమి సర్వే నెం నెం 94,95,96 ఉంది . తమకు అగ్రిమెంట్ చేసిన ఇప్పుడు భూమిని తమకు తెలియకుండా వేరే వారికి రిజిస్ట్రేషన్ చేశారని బాధితులు నిన్న ఆందోళనకు దిగారు . తహసీల్దార్ కార్యాలయం ముందు అగ్రీమెంట్ చేసుకున్న వ్యక్తి నిన్న పెట్రోల్ పోసుకోని అత్మహత్య యత్నం చేశారు. గ్రామస్తుల, పోలీసుల మధ్య నిన్న తోపులాట చోటుచేసుకుంది.