Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగుదేశం పార్టీ దివంగత నేత పరిటాల రవి ప్రధాన అనుచరుడు అనంతపురం జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ సాబ్ ఈరోజు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే అనంతపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. నిన్న జరిగిన పరిటాల రవీంద్ర కుమార్తె పరిటాల స్నేహలత వివాహ వేడుక పర్యవేక్షణ కోసం మూడు రోజులుగా వెంకటాపురంలోనే ఉన్న చమన్‌కు సోమవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. మంత్రి పరిటాల సునీత వెంటనే చమన్‌ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ చమన్ మృతి చెందారు.
వివాహం సందర్భంగా ఆందరినీ పలకరిస్తూ, ఎంతో సంతోషంగా గడిపిన చమన్ మరణించిన సంగతి తెలుసుకున్న టీడీపీ నేతలు షాక్ అయ్యారు. దీంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా విషాదం నెలకొంది. అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మగా కూడా చమన్ పని చేశారు. చమన్ పరిటాల రవికి ప్రధాన అనుచరుడు మాత్రమే కాదు అత్యంత సన్నిహితుడు. అయితే 2004 తర్వాత జరిగిన ఫ్యాక్షన్ హత్యలతో చమన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత 2012లో మళ్లీ అనంతపురం వచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగిరి మండలం టీడీపీ నుంచి జెడ్పీటీసీగా గెలిచారు. పార్టీ ఒప్పందం ప్రకారం 2014 నుంచి 2017 వరకు రెండున్నరేళ్ల పాటూ అనంతపురం జెడ్పీ ఛైర్మన్‌గా పని చేసి రాజీనామా చేశారు. పరిటాల రవి చనిపోయినప్పుడు ఆయనతోనే ఉండాల్సిన చమన్ అప్పుడు చావు తప్పించుకున్నారు అని అంటుండే వారు అటువంటిది పరిటాల కుమార్తె పెళ్లి అయ్యాక మరణించడం చూసి వెంకటాపురం వాసులు కన్నీళ్ళపర్యంతమవుతున్నారు. ఆయన భౌతికకాయాన్ని రామగిరి మండలం కొత్తపల్లికి తరలించనున్నారు. రేపు ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి.