హిల్ రిసార్ట్ లో పార్టీ… బడా బాబులు అరెస్ట్…

యస్ బ్యాంక్ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు బిలియనీర్లు అయిన కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ లను ముంబై పోలీసులు అరస్ట్ చేశారు. కరోనా -19 లాక్‌డౌన్‌ నిబంధలను ఉల్లంఘించిన విందు వినోదాలతో ఎంజాయ్ చేస్తున్న వారిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ముంబైలోని హిల్ రిసార్ట్‌లోని వారి ఫామ్‌హౌస్‌ లో వీరంతా విందు ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు వీరికి అక్కడికి వెళ్లేందుకు అనుమతిచ్చిన ఐఎఎస్ అధికారిపై కూడా వేటు పడింది.

అయితే వీరు తన కుటుంబ స్నేహితులను, కుటుంబంలోని అత్యవసర పరిస్థితుల నిమిత్తం ఖండాలా నుంచి మహాబలేశ్వర్ వరకు వెళ్లేందుకు అనుమతించాలని అమితాబ్ గుప్తా పాసులు జారీ చేశారు. దాంతో వారంతా తాజాగా ఓ రాత్రి ఐదు కార్లలో ముంబైకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నఫామ్‌హౌస్‌ కి చేరుకున్నారు. అక్కడ వాధ్వాన్ల వంటవారు, సేవకులు ముఖ్యంగా కరోనా వైరస్ సంక్షోభంలో అత్యంత ప్రభావితమైన దేశం ఇటలీకి చెందిన వాధ్వాన్ బాడీగార్డ్ ఇందులో ఉండటం అందరినీ కలచివేసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అధికారులు వీరందరిపైనా కేసు నమోదు చేసి ఆ తర్వాత క్వారంటైనకు తరలించారు.

కాగా పీఎంసీ బ్యాంకు కుంభకోణంతో పాటు పలు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు, కపిల్, ధీరజ్ వాధ్వాన్ మీద సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. గత నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. మూడుస్లారు నిందితులు తప్పించుకున్నారు. అయితే క్వారంటైన్ గడువు ముగిసిన తర్వాత వారిని అదుపులోకి తీసుకోవాలని సీబీఐ వేచి చూస్తుంది.