మహేష్‌పై అంతగా ఆశలు పెట్టుకోవడం వృదా

Paruchuri Krishna Comments Mahesh Babu Chatrapati Shivaji Character

Posted October 12, 2017 at 12:29 

మహేష్‌బాబు రిస్క్‌ లేకుండా సింపుల్‌గా సినిమాలు చేయాలనుకుంటాడు. ప్రయోగాలకు దూరంగా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న పాత్రలను, సినిమాలను మాత్రమే చేస్తూ కెరీర్‌లో ముందుకు వెళ్లాలని భావిస్తూ ఉంటాడు. మహేష్‌బాబు కెరీర్‌ ఆరంభం నుండి తాజాగా విడుదలైన స్పైడర్‌ వరకు చూస్తే దాదాపు అన్ని సినిమాలు కూడా కమర్షియల్‌ సినిమాలు మాత్రమే. ఏ ఒక్కటి కూడా ప్రయోగాత్మకంగా, ఆర్ట్‌ సినిమాగా ఉన్నది లేదు. ఎవరైనా విభిన్న కథాంశంను తీసుకు వెళ్లినా కూడా రిస్క్‌ చేయలేను అంటూ సున్నితంగా తిరష్కరిస్తాడు. ప్రేక్షకులకు ఏది కావాలో అదే చేస్తాను అంటూ మహేష్‌బాబు మొదటి నుండి కూడా చెబుతూ వస్తున్నాడు. 

తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ మహేష్‌బాబును చత్రపతి శివాజీ పాత్రలో తాను చూడాలనుకుంటున్నాను, నేను మాత్రమే కాదు ఎంతో మంది ప్రేక్షకులు ఆయన అభిమానులు కూడా అలా చూడాలని కోరుకుంటున్నారు. ఒక వేళ మహేష్‌బాబు చత్రపతి శివాజీ పాత్రను చేస్తే అద్బుతంగా ఉంటుంది. ఇండియాలో ఏ నటుడు కూడా చత్రపతి శివాజీ పాత్రకు అంతా సూట్‌ అవ్వరు. కాని మహేష్‌బాబు మాత్రం శివాజీ పాత్రకు అద్బుతంగా సెట్‌ అవుతాడు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

చాలా సంవత్సరాల క్రితం చత్రపతి శివాజీ పాత్రను సూపర్‌ స్టార్‌ కృష్ణ చేయాలని కోరుకున్నాడు. ఎన్నో అద్బుతమైన పాత్రలు పోషించి మెప్పించిన కృష్ణ ఆ పాత్రను పోషించకుండానే, ఆ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టి పూర్తి చేయకుండానే సినిమాల నుండి వైదొలిగాడు. పలు సందర్బాల్లో ఆ పాత్రను చేయలేక పోయినందుకు బాధగా ఉంది అంటూ తన అసహనంను వ్యక్తం చేశాడు కూడా. ఇప్పుడు ఆయన కొడుకు అయిన మహేష్‌బాబు ఆ పాత్రను చేస్తే చూడాలని కృష్ణ కోరుకుంటున్నాడు. కాని మహేష్‌బాబు మాత్రం అంత సాహసం చేస్తాడని ఏ ఒక్కరు అనుకోడం లేదు. మహేష్‌బాబుకు అసలు పౌరాణిక పాత్రలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. గతంలో తనకు ఎంతో ఆప్తుడు అయిన గుణశేఖర్‌ ‘రుద్రమదేవి’ చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రకు మహేష్‌బాబును సంప్రదించగా అలాంటి పాత్రను చేయలేను అంటూ చెప్పేశాడు. గన్నారెడ్డి పాత్రకే నో చెప్పిన మహేష్‌ శివాజీ పాత్రకు ఎలా ఓకే చెప్తాడు చెప్పండి. అందుకే ఆశలు వృదా.

SHARE