ఎన్టీఆర్ బయోపిక్ కి ముగ్గురు నిర్మాతలు.

Balakrishna NTR Biopic make by 3 producers

Posted October 12, 2017 at 12:08 

బాలయ్య హీరోగా చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమాని బాలయ్య సొంతంగా తీస్తాడని ముందు వినిపించింది. అయితే ఆయన మరో ఇద్దరు నిర్మాతల్ని కలుపుకుని ఈ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. బాలయ్య కి ఎంతో సన్నిహితంగా వ్యవహరించే వారాహి ప్రొడక్షన్స్ సాయి కొర్రపాటి, ఇక స్టార్స్ తో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించిన ccl విష్ణు కూడా ఎన్టీఆర్ బయోపిక్ లో భాగస్వాములు కానున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి జరుగుతున్న స్క్రిప్ట్ వర్క్ మొదలైనవి చూసుకోవడంలో ఆ ఇద్దరూ చురుగ్గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. అయితే ccl విష్ణు, బాలయ్య సొంత బ్యానర్ పేర్లు ఇంకా డిసైడ్ కాలేదు. పేర్లకి సంబంధించి బాలయ్య పండితులతో చర్చిస్తున్నారట. ఆ వ్యవహారం పూర్తి కాగానే ముగ్గురు నిర్మాతల పేర్లు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం వుంది.

ఇలా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలిసి సినిమా చేయడం కొత్తేమీ కాదు. స్టార్ హీరోల డేట్స్ సర్దుబాటు కానప్పుడు బడా ప్రొడ్యూసర్స్ కొందరికి కలిపి డేట్స్ ఇవ్వడం ఎన్టీఆర్ తోనే మొదలు అయ్యింది. ఇక నటుల హవా మొదలు కాక మునుపే చిత్ర నిర్మాణంలో ఓ బ్రాండ్ గా నిలిచిన విజయ వాహిని సంస్థలతో పాటు అప్పట్లో పెద్ద బ్యానర్స్ అన్నిటా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలిసి పనిచేసేవారు. పనిని పంచుకోవడంతో పాటు అన్ని విషయాల్లో చర్చించి ముందుకు వెళ్లడం తో సినిమా బాగా వస్తుందని ఓ నమ్మకం. బాలయ్య కూడా ఇదే ఫార్ములాని నమ్ముకున్నాడు. తనతో పాటు చిత్ర నిర్మాణం, పంపిణీలో అపార అనుభవం వున్న సాయి కొర్రపాటితో పాటు, మార్కెటింగ్ లో కొత్త కొత్త విధానాలు తెచ్చే విష్ణు ని భాగస్వాములుగా చేర్చుకున్నట్టు తెలుస్తోంది.

SHARE