బాలయ్యను తిరష్కరించిన ముగ్గురు మెగా హీరోయిన్స్‌?

Mega Heroines Rejected To Act In Balayya Next Movie

Posted October 12, 2017 at 11:46 

చిన్న హీరోలకు స్టార్‌ హీరోలతో నటించే ఛాన్స్‌ వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తారు. కాని పలువురు హీరోయిన్స్‌ మాత్రం బాలయ్యతో సినిమా అంటే ఆసక్తి చూపించడం లేదు. గతంలో పలువురు హీరోయిన్స్‌ను సంప్రదించగా వారిలో చాలా మంది ఏదో సిల్లీ కారణాలు చెబుతూ బాలయ్యతో నటించేందుకు నో చెప్పారు. బాలయ్యకు స్టార్‌ ఇమేజ్‌ ఉన్నప్పటికి ఆయన సక్సెస్‌ రేట్‌ చాలా తక్కువ. అలాగే ఆయన వ్యక్తిగత ప్రవర్తనపై కూడా సినీ వర్గాల్లో బ్యాడ్‌ ప్రచారం ఉంది. అందుకే ఆయనతో నటించేందుకు హీరోయిన్స్‌ ఇబ్బంది పడతారు. ఆయనతో సినిమాలు చేసే కంటే చిన్న హీరోతో లేదా కొత్త హీరోతో అయినా చేయడం ఉత్తమం అంటూ కొన్నాళ్ల క్రితం ఒక హీరోయిన్‌ డైరెక్ట్‌గా అన్నట్లుగా ఒక మీడియాలో కథనం ప్రసారం అయ్యింది.

హీరోయిన్స్‌ భావిస్తున్నట్లుగా బాలయ్యలో బ్యాడ్‌ క్వాలిటీస్‌ ఏమీ లేవు. కాకుంటే ఆయన ఏదైనా చేయాలనుకుంటే పట్టుబడుతారు. ఆ కారణంగా కొన్ని సార్లు ఇబ్బందులు తలెత్తితే తలెత్తవచ్చు. ఈ విషయం ఎంతగా చెప్పినా హీరోయిన్స్‌కు మాత్రం బుర్రకు ఎక్కడం లేదు కావచ్చు. అందుకే మరోసారి కూడా బాలయ్యను ముగ్గురు హీరోయిన్స్‌ తిరష్కరించారు. ప్రస్తుతం రవికుమార్‌ దర్శకత్వంలో బాలయ్య తన 102వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మను ఎంపిక చేయాలని దర్శకుడు భావించాడు. మొదటి హీరోయిన్‌గా నయనతార, రెండవ హీరోయిన్‌గా నటాషను ఎంపిక చేయగా మూడవ హీరోయిన్‌ అన్వేషణ కొనసాగుతుంది.

మెగా హీరోల సరసన నటించిన ముగ్గురు ముద్దుగుమ్మలు రెజీనా, ప్రగ్యా జైస్వాల్‌, లావణ్య త్రిపాఠిను ఆ మూడవ హీరోయిన్‌ పాత్ర కోసం సంప్రదించారట. ఈ ముగ్గురు కూడా బాలయ్య సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించలేదని, ముగ్గురు వేరు వేరు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. బాలయ్యతో సినిమాలో అంటే ఆసక్తి చూపించని హీరోయిన్‌, అది మూడవ హీరోయిన్‌ అంటే ఓకే చెప్తారా అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు నో చెప్పడంతో ఒక కొత్త అమ్మాయిని కన్నడం లేదా మలయాళం నుండి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

SHARE