గురువు మీదకి శిష్యుడిని వదిలిన బాలయ్య.

teja-will-direct-the-ntr-biopic-movie-in-the-production-of-balayya

Posted October 12, 2017 at 11:14 

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు , రాజకీయ దురంధరుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర సాక్షిగా గురు శిష్యులు ఢీకొట్టబోతున్నారు. “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” కి గురువు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తుంటే బాలయ్య హీరోగా చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కి తానే డైరెక్షన్ చేయబోతున్నట్టు శిష్యుడు తేజ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో ఇప్పటిదాకా అనధికారికంగా వినిపించిన గురుశిష్యుల పోరాటం ఇప్పుడు అఫిషియల్ అయిపోయింది.

వర్మ ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేసుకుని నటుల ఎంపిక పనిలో పడ్డాడు అనుకుంటే పైకి చెప్పడం లేదు కానీ తేజ అండ్ కో అంత కన్నా స్పీడ్ గా ఉన్నారంట. స్క్రిప్ట్ మీద బాలయ్య, తేజ డిస్కషన్స్ కూడా పూర్తి అయ్యాయట. ఇక రాము సినిమా ఓపెనింగ్ 2018 ఫిబ్రవరి అనుకుంటున్నారు. అంతకన్నా ముందే జనవరిలోనే తేజ సినిమా కొబ్బరికాయ కొట్టుకోనుంది. ఇక గురువు సినిమా రిలీజ్ అక్టోబర్ అంటే శిష్యుడు సినిమా అంతకన్నా ముందే విడుదల అయ్యే అవకాశం ఉందట. అయితే కాలంతో పోటీ కన్నా కంటెంట్ తో పోటీ పడాల్సి ఉంటుందని ఇటు రాము, అటు తేజకి కూడా తెలుసు. పైగా రన్నింగ్ రేసులా పరిగెడదాం అనుకుంటే కుదరదు. ఎందుకంటే భుజాన ఎన్టీఆర్ జీవితం అనే పెద్ద బరువుని అతి జాగ్రత్తగా మోయాల్సి ఉంటుంది. మొత్తానికి తాను సినిమా ఇవ్వనందుకు పోటీగా వస్తున్న రాము మీదకి శిష్యుడిని వదిలి బాలయ్య భలే ట్విస్ట్ ఇచ్చాడు.

SHARE