ఎన్టీఆర్ బయోపిక్ 2 భాగాలు?

Gossips On Film Industry About RGV Lakshmi's Ntr Movie On Two Parts

Posted October 12, 2017 at 10:51 

” లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా గురించి పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా ఒప్పుకున్న దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ ఎక్కడ లేని హైప్ తీసుకురావడానికి ఎప్పటి లాగానే తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. పనిలో పనిగా “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా ఎన్టీఆర్ జీవితంలో ఎక్కడ నుంచి మొదలై ఎక్కడితో ఆగిపోతుందో కూడా చెప్పేసారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించినప్పటి నుంచి ఆయన మరణం దాకా ఉంటుందన్నారు. అటు బాలయ్య హీరోగా రాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ మాత్రం ఆయన చిన్నప్పటి నుంచి మొదలై నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుతో సమాప్తం అవుతుందట. అంటే బాలయ్య ఎన్టీఆర్ సినీ, రాజకీయ వైభవాన్ని చూపితే “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” లో ఆయన చరిత్రలో చివరి పేజీల్ని తెరకి ఎక్కించబోతున్నారు.

లక్ష్మీపార్వతి కోణంలో రామ్ గోపాల్ వర్మ సినిమా తీసాక, వైస్రాయ్ ఎపిసోడ్, అధికార మార్పిడికి సంబంధించి కౌంటర్ చేయకపోతే ఎలా అన్న ప్రశ్న టీడీపీ వర్గాలు, అభిమానుల నుంచి అప్పుడే మొదలై పోయింది. రాము ఎటూ లక్ష్మీపార్వతిని హైలైట్ చేస్తాడు కాబట్టి ఎన్టీఆర్ జీవితంలో అతి కీలక ఘట్టాలైన వాటి గురించి కూడా చంద్రబాబు, ఎన్టీఆర్ ఫామిలీ కోణం నుంచి చూపాలని డిమాండ్ ఊపు అందుకుంటోంది. ఈ డిమాండ్ కి తగ్గట్టు ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ విజయం సాధిస్తే రెండో భాగం కూడా తీయడానికి బాలయ్య అండ్ కో సై అనే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించాక జరిగిన పరిణామాలతో సినిమా రెండో పార్ట్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

SHARE