ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంజిల్లా కదిరిలో పోలీస్ పాదాలకు ప్రజలు పాలాభిషేకం చేశారు. ఖాకీలంటే కాటి న్యాయానికి పర్యాయపదంగా అంటారు. అలాంటి ఖాకీవనంలోని పోలీస్ ఆయన ప్రజల చేత పాలాభిషేకం చేయించుకున్న ఘటన మండల కేంద్రమైన నల్లచెరువు దళిత వాడల్లో చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రపంచ ప్రజలను భయపెడుతున్న మహమ్మారి కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవటంలో ఆప్ కాకి తగినంత శ్రద్ధ చూపించడమే కాక ప్రజలను జాగ్రత్త పరచడంలో విజయం సాధించారు. అందువల్లే నల్లచెర్వు సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న మునీర్ అహ్మద్ ప్రజల మనసు దోచుకున్నాడు.అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాలు తిరుగుతూ మారుమూల పల్లెల్లో కూడా వదిలిపెట్టకుండా ప్రజలను కరోనా పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.
అంతా స్వీయ గృహ నిర్బంధం ఉండాలని దాంతో కరోనా మహమ్మారి నుంచి బయట పడ వచ్చని నచ్చజెప్పారు. ప్రజలకు అవసరమైన వసతి ఏర్పాట్లు కూడా తన పర్యవేక్షణలోనే వివిధ మార్గాల ద్వారా చేరవేయడంలో కూడా ఆయన తన మనసును చాటుకున్నారు. కాగా దళితవాడకు ఎస్సైని ఆహ్వానించి సాంప్రదాయంగా పల్లెంలో పాదాలు పెట్టి తొలుత నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత పాలాభిషేకం చేసి గొప్ప గౌరవాన్ని ప్రదర్శించారు. పాదాలపై పూలు చల్లి తమ గౌరవాభిమానాన్ని చాటుకున్నారు. పూలహారాలు తెచ్చి ఆయనకు శాలువా కప్పి పూలతో అలంకరించారు. ప్రజలకు సేవలు చేస్తే ప్రతిఫలంగా వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంటారని నల్లచెరువు దళితవాడలో ఎస్సై మహ్మద్ జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు.