త్రివిక్రమ్‌ ఎంత పని చేశావయ్యా…

pawan fans fires on trivikram over agnathavasi Movie
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో పవన్‌ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలతో వీరిద్దరు బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొట్టారు. ఈ చిత్రంతో మరోసారి రికార్డులను బ్రేక్‌ చేసి, హ్యాట్రిక్‌ దక్కించుకోవాలని భావించారు. కాని సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఫ్యాన్స్‌ ఆశించిన స్థాయిలో అజ్ఞాతవాసి లేదు. పవన్‌ కళ్యాణ్‌ 25వ చిత్రం అంటే త్రివిక్రమ్‌ సీరియస్‌గా తీస్తాడని, పవన్‌ కెరీర్‌లో నిలిచి పోయే చిత్రంలా ఉంటుందని ఫ్యాన్స్‌ ఆశించారు. కాని అజ్ఞాతవాసి మాత్రం దారుణమైన రిపోర్ట్‌ను తెచ్చుకుంది. ఫ్యాన్స్‌ కూడా పైకి చెప్పకున్నా లోలోపల తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

కొందరు పవన్‌ ఫ్యాన్స్‌ బాహాటంగానే త్రివిక్రమ్‌పై ఆగ్రహంను వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ స్థాయి హీరోతో చేయాల్సిన సినిమా ఇదేనా, అసలు త్రివిక్రమ్‌ ఏ ఉద్దేశ్యంతో ఇలాంటి చెత్త సినిమా తీశాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయాలనే ఉద్దేశ్యంతోనే త్రివిక్రమ్‌ ఈ సినిమాను తీశాడు అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్‌ గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా చెత్తగా ఉందని, త్రివిక్రమ్‌ కెరీర్‌లోనే చెత్త సినిమా అంటూ తేల్చి పారేస్తున్నారు. పవన్‌ వంటి హీరోను చేతిలో ఉంచుకుని ఒక సిల్లీ కామెడీ సినిమాను ప్లాన్‌ చేశాడు. పవన్‌, త్రివిక్రమ్‌ల స్థాయిలో సినిమా లేదని, పవన్‌తో చాలా లోక్లాస్‌ కామెడీని చేశాడు అంటూ ఫ్యాన్స్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.