Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ తాజాగా సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రం దారుణంగా ఫ్లాప్ అయ్యింది. అభిమానుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యింది. అజ్ఞాతవాసి ఫ్లాప్ నుండి వెంటనే బయటకు వచ్చిన పవన్ రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టాడు. పవన్ తెలంగాణలో పలు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు సభలు సమావేశాలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ దృష్టి అంతా కూడా రాజకీయాల్లోనే ఉందని తెలుస్తోంది. పవన్ 26వ చిత్రం గురించి ఇప్పట్లో ఆలోచించే అవకాశం లేదని సినీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అజ్ఞాతవాసి షూటింగ్ జరుగుతున్న సమయంలోనే పవన్ 26వ చిత్రం ‘కందిరీగ’ చిత్ర దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో ఉంటుందని అంతా భావించారు. కేవలం 40 రోజుల్లో సంతోష్ శ్రీనివాస్ సినిమాను పూర్తి చేసేందుకు పవన్‌ను ఒప్పించాడని, అందుకు పవన్ కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. 40 కోట్ల పారితోషికం అంటూ ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు ఇతరత్ర విషయాల కారణంగా పవన్ 26వ చిత్రాన్ని ఇప్పట్లో చేస్తాడని తాము భావించడం లేదు అంటూ ఆయనకు సన్నిహితంగా ఉండే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల వరకు పవన్ రాజకీయాలతో బిజీగా ఉండే అవకాశం ఉంది. అందుకే పవన్ 26వ చిత్రం ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. పవన్ 2019 ఎన్నికల్లో గెలిచి సీఎం అయితే ఇక పూర్తిగా పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.