పవన్ కు కీ ఇస్తున్న బాబు

Pawan kalyan and Chandrababu Naidu to meet over Uddanam crisis

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి చాణక్య ఎత్తుగడలకు తెరలేపారు. పవన్ కళ్యాణ్ ను కలిసి చాలా సమయం అయింది కాబట్టి మరోసారి ఆయనతో భేటీ కావాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఉద్దానం కిడ్నీ బాధితులకు పెన్షన్ ప్రకటించిన చంద్రబాబు.. ఈ విషయంతో పాటు కాపు రిజర్వేషన్ల అంశంపై కూడా జనసేన అధినేతతో చర్చించాలని భావిస్తున్నారు చంద్రబాబు.

పవన్ ను ముద్రగడ మొహమాటపెట్టకుండా ముందుగానే ముందరి కాళ్లకు బంధాలు వేయాలనుకుంటున్నారు బాబు. ఇందుకోసం ఇప్పటికే బాబును కలవాలని పవన్ కు వర్తమానం వెళ్లింది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ ను వదులుకోకుండా వచ్చే ఎన్నికలకు కూడా వాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు సీఎం. నయానో, భయానో దారికి తెచ్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

అందుకే కేబినెట్ భేటీలో కూడా పవన్ కు నచ్చే నిర్ణయాలే తీసుకున్నారు. బెల్టుషాపులు రద్దు చేశారు. కాపు రిజర్వేషన్లపై త్వరగా నివేదిక ఇవ్వాలని మంజునాథ కమిషన్ ను కోరారు. ముద్రగడ పాదయాత్ర లోగా పవన్ తో ప్రభుత్వానికి అనుకూల ప్రకటనలు ఇప్పించగలిగితే.. ముద్రగడ వెనుక ఎవరూ లేకుండా జాగ్రత్తపడొచ్చనేది చంద్రబాబు ఆలోచన.

మరిన్ని వార్తలు

మోడీ, కేసీఆర్ ఫెవికాల్ బంధం

మోడీ కోసం ముందే కూస్తున్న నితీష్