బస్సు యాత్ర ప్రకటించిన పవన్…అక్కడినుండే ప్రారంభం !

pawan kalyan bus yatra start from ichchapuram

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఈనెలలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్ర చేపడతారని ముందు నుండి వశ్ర్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతా అనుకున్నట్టుగానే ఆయన బస్సు యాత్ర చేయనున్నట్టు ప్రకటించారు. విశాఖపట్నంలోని అంబేద్కర్‌ భవన్‌లో నిన్న నిద్ర చేసిన పవన్‌ కల్యాణ్‌ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆంద్ర దేశంలో ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాటం ప్రారంభిస్తున్నానని, ఇందులోభాగంగా ఈ నెల 20వ తేదీన ఇచ్ఛాపురం నుంచి బస్సుయాత్ర చేపడుతున్నానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

గంగపూజ నిర్వహించి యాత్ర మొదలుపెడతామని, జై ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులర్పిస్తామని, మొత్తం 17రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో తన పర్యటన ఉంటుందని చెప్పారు. బస్సుయాత్రలో భాగంగా ప్రత్యేక హోదా మోసానికి నిరసనగా ప్రతి నియోజకవర్గంలో యువత, విద్యార్థులతో కవాతు నిర్వహిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో లక్షమందితో ఈ కవాతు ఉంటుందని పవన్‌ తెలిపారు. మనకు రాజకీయ జవాబుదారీతనం ఉండే ప్రభుత్వాలు రావాలని ఆయన ఆకాంక్షించారు, అలాగే బీజేపీ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు.

పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం బాధాకరమని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన ప్రభుత్వం వస్తే అన్ని జిల్లాల్లో అమరుల స్మారక చిహ్నాలు పెడతామని, 2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని పవన్ కల్యాణ్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రత్యక హోదాతోపాటు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని అమలుచేయలేదని అన్నారు.