చంద్రబాబుగా కనిపించనున్న రానా !

Daggubati Rana turns as Chandrababu in NTR Biopic movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు వారంతా ముద్దుగా అన్నగారు అని పిలుచుకునే ఎన్టీఆర్ బయోపిక్ అట్టహాసంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా అతిరథ మహారథుల సమక్షంలో ఈ సినిమా వైభవంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో హీరో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా బాలయ్యే నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమాని తేజ మొదలెట్టినా కారణాలేవో తెలియదు కానే పక్కకు తప్పుకున్నారు. కానీ ఎన్టీఆర్ గా నటిస్తూ నిర్మిస్తున్న నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ బయోపిక్ ని పక్కన పెట్టాలనుకోవడం లేదు. డైరెక్టర్ రాఘవేంద్ర రావు, క్రిష్ తదితరులను సంప్రదించినా డైరెక్టర్ విషయంపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం షూటింగ్‌కు గ్యాప్ ఇచ్చారు. ఈ సమయాన్ని వృధా చేయకుండా మూవీ యూనిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైందని తెలుస్తోంది.

ఓ సీనియర్ డైరక్టర్ కి ఈ సినిమా బాధ్యతలు అప్పగించారని ఆయన ప్రస్తుతం స్క్రిప్ట్ ని సిద్దం చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే నిర్మాతలు రానా దగ్గుబాటిని కలిశారట. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానాను కలిశారని టాక్. ఈ సినిమాలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించనుంది. నిర్మాతలు రానా దగ్గబాటితో కలసి పాత్ర గురించి చర్చించారని రానా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఆసక్తిని కనబరిచారని సమాచారం. రానా నుంచి వారంలోపు కన్ఫర్మేషన్ రావచ్చని తెలుస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న భారీ ప్రకటన చేసేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. డైరెక్టర్ ఎవరనేది కూడా అప్పడే ప్రకటిస్తారని సమాచారం.