ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాలను సృష్టించిందో మనందరికీ తెలిసిందే… కాగా అంతటి దారుణమైన ఘటన కి పాల్పడ్డటువంటి నలుగురు నిందితులకు నేడు ఉదయం ఉరి శిక్ష అమలు చేసారు జైలు అధికారులు…. అయితే ఈ నేపథ్యంలో ఆ నలుగురు మృగాలకు మరణ శిక్ష విధించడం పై పలువురు తమ భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మేరకు నలుగురు నిందితుల ఉరిశిక్ష అమలుపై స్పందించినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.
కాగా గతంలో నిర్భయను అత్యంత దారుణంగా హతమార్చినటువంటి నలుగురు మృగాలను ఉరితీయడం అత్యంత గొప్పదని అభివర్ణించిన పవన్ కళ్యాణ్ నిర్భయ దోషులను బహిరంగంగా ఉరి తీసి ఉంటే సమాజంలో కొంతైనా మార్పుకు అవకాశం ఉండేది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా మానవమృగాలకు మరణశిక్షపడిన రోజు ఒక గొప్ప సూర్యోదయం అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. ఈ కేసులో లాయర్లు పడ్డ కష్టాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాఖ్యానించారు.