Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ స్టార్ హీరోలందరిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా విభిన్నం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన హీరోను చిన్న మాట అంటేనే వారు తట్టుకోలేరు. బౌతిక దాడులు చేసేందుకు కూడా వెనుకాడరు. చిన్న విమర్శ చేసినా కూడా వారిపై సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే చేస్తారు అనే విషయం గతంలో పలువురికి అనుభవం అయ్యింది. కత్తి మహేష్ విషయంలో పవన్ ఫ్యాన్స్ చేసిన సోషల్ యుద్దం ఏరేంజ్‌లో జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి పవన్‌ను అనవసరంగా, కారణం లేకుండా అత్యంత నీచంగా శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి దూషించడం, ఆయన్ను అన్న అనడం నా తప్పు అంటూ చెప్పుతో కొట్టుకోవడంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు.
శ్రీశక్తి ఒక అమ్మాయి అవ్వడం వల్ల ఆమెపై బౌతిక దాడులు చేయలేదు, కాని ఆమె చేసిన వ్యాఖ్యలకు ఏం చేసినా తప్పు లేదు అంటూ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాము దేవుడిగా పూజించే వ్యక్తిని అంత నీచంగా విమర్శించడంతో పవన్ ఫ్యాన్స్ ఆక్రోశంను ఆపుకోలేక పోతున్నారు. పవన్‌ను ఏకంగా అమ్మ.. అంటూ తిట్టిన ఏకైక వ్యక్తి శ్రీశక్తి. పవన్‌ను చిన్న మాట అంటేనే ఊరుకోని ఫ్యాన్స్ ఇప్పుడు శ్రీరెడ్డిని మాత్రం ఎలా వదిలేస్తారు. సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. అయినా కూడా ఫ్యాన్స్ మనోవేదన చల్లారడం లేదు. వెంటనే పవన్‌కు ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.