రంగంలోకి దిగేసిన జీవిత

jeevitha rajasekhar press meet casting couch in Tollywood

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

టాలీవుడ్‌ కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం మలుపులు మలుపులు తిరుగుతూ అందరిని టచ్‌ చేస్తోంది. మొన్నటి వరకు శ్రీరెడ్డి మాత్రమే సినిమా ప్రముఖులపై విమర్శలు చేస్తూ ఉండేది. కాని ఇప్పుడు ఆమెకు తోడుగా డజను మంది తోడు అయ్యారు. ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ భారీగా ఉందని వారు సాక్ష్యాధారాలతో సహ చూపుతున్నారు. ఈ వివాదం తిరిగి తిరిగి రాజశేఖర్‌ను కూడా అంటుకుంది. చాలా సంవత్సరాల క్రితం రాజశేఖర్‌ కోసం అమీర్‌పేట్‌ లేడీస్‌ హాస్టల్స్‌ నుండి అమ్మాయిలను స్వయంగా జీవిత రప్పించేది అంటూ ఒక మీడియా కథనం ప్రచురించింది. ఇప్పుడు అదే విషయం మళ్లీ వెలుగులోకి వస్తుంది.

మహిళ సామాజీక కార్యకర్త సంధ్య ఒక టీవీ ఛానెల్‌లో చేసిన ఆరోపణలు రాజశేఖర్‌ను ప్రస్తుతం బజారుకు ఈడ్చడం జరిగింది. కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంకు దీనికి సంబంధం లేదు, అయినా కూడా రాశేఖర్‌ విషయాన్ని సంధ్య తీసుకు రావడంతో జీవిత ఆగ్రహంను వ్యక్తం చేస్తుంది. తనపై, తన భర్తపై వస్తున్న ఆరోపణలకు నేడు సాయంత్రం ప్రెస్‌ మీట్‌ పెట్టి మరీ సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకుంది. జీవిత గతంలో మీడియాలో వచ్చిన విషయాలను ఖండివ్వడం జరిగింది. ఇప్పుడు మరోసారి అదే ఖండన ఉంటుందని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. మొత్తానికి జీవిత ప్రెస్‌మీట్‌ పెట్టడంతో ఈ కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జీవిత ప్రెస్‌మీట్‌లో ఏం చెబుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.