కత్తి మహేష్‌ లాగుతూనే ఉన్నాడు..!

Kathi Mahesh Sensational Comments on Pawan Kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌ వివాదాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ రోజు ఏదో ఫ్లోలో పవన్‌పై విమర్శలు చేశాడులే అనుకుంటే ఇప్పుడు మళ్లీ మళ్లీ పవన్‌ కళ్యాణ్‌పై, ఆయన అభిమానులపై, జనసేన పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలు పీకే ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. పలు సార్లు కత్తి మహేష్‌ను పవన్‌ ఫ్యాన్స్‌ బెదిరించినా కూడా ఆయన వెనక్కు తగ్గడం లేదు. తనను మానసికంగా పవన్‌ ఫ్యాన్స్‌ హింసిస్తున్నారని, తనను చంపేందుకు కూడా పవన్‌ ఫ్యాన్స్‌ వెనుకాడటం లేదని, బండ్ల గణేష్‌ కూడా తాజాగా కత్తి మహేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఎన్ని విమర్శలు వచ్చినా కూడా కత్తి మహేష్‌ మాత్రం ప్రతి రోజు ఏదో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ వివాదంను పెద్దది చేస్తున్నాడు. సినీ ప్రముఖులు పలువురు స్వయంగా కత్తి మహేష్‌తో మాట్లాడి వివాదంను సర్దుమనిగేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నా కూడా కత్తి మహేష్‌ మాత్రం ఫ్యాన్స్‌ చేస్తున్న వ్యాఖ్యలకు రెచ్చి పోతున్నాడు. పవన్‌ ఫ్యాన్స్‌ను ఉగ్రవాదులని, పవన్‌కు మానవత్వం లేదని, తన స్టార్‌డంతో పవన్‌ ఏదైనా చేస్తాననే గుడ్డి నమ్మకంతో ఉన్నాడు అంటూ కత్తి మహేష్‌ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపుతున్నాయి. ఈ వివాదాన్ని కత్తి మహేష్‌ ఇంకా ఎంత కాలం సాగదీయాలని భావిస్తున్నాడో అంటూ సినీ వర్గాల వారు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం పెరిగినా కొద్ది కత్తి మహేష్‌కు ప్రమాదం పొంచి ఉంటుందని అంటున్నారు.

మరిన్ని వార్తలు:

ఓవర్సీస్‌లో అర్జున్‌ రెడ్డికి మాత్రమే ఇది సాధ్యమైంది

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు అతి పెద్ద బ్యాడ్‌ న్యూస్‌