ఓవర్సీస్‌లో అర్జున్‌ రెడ్డికి మాత్రమే ఇది సాధ్యమైంది

arjun-reddy-getting-record-collections-in-overseas-market

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

విజయ్‌ దేవరకొండ హీరోగా సందీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రానికి ప్రేక్షకుల నుండి సక్సెస్‌ టాక్‌ దక్కింది. సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కలెక్షన్స్‌ వీర లెవల్‌లో వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో మొత్తంగా 50 కోట్ల మార్క్‌ దాటినా ఆశ్చర్యం లేదని సినీ వర్గాల వారు అంటున్నారు. ఒక ఎ సర్టిఫికెట్‌ సాధించిన సినిమాకు ఈ స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్‌ నుండి ఆధరణ రావడం చాలా అరుదు. తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు సినిమాలకు మాత్రమే ఇలాంటి గుర్తింపు దక్కింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా కొత్త రికార్డును దక్కించుకుంది.

టాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు ఓవర్సీస్‌లు మంచి కలెక్షన్స్‌ను రాబట్టాయి. ఎన్నో సినిమాలు ఓవర్సీస్‌లో మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే అవేవి ఎ సర్టిఫికెట్‌ సినిమాలు కాదు. ఇప్పటి వరకు అమెరికాలో ఎ సర్టిఫికెట్‌ పొందిన తెలుగు సినిమా మినిమం హాఫ్‌ మిలియన్‌ డాలర్లను కూడా వసూళ్లు చేయలేక పోయింది. కాని ఈ సినిమా మాత్రం రెండు మిలియన్‌ డార్లను వసూళ్లు చేసేందుకు దూసుకు పోతుంది. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు ఆధరిస్తున్న తీరు అందరికి షాక్‌ ఇస్తుంది. లెక్కకు మించి ముద్దు సీన్‌లు ఉన్నా కూడా, చాలా బోల్డ్‌ సన్నివేశాలున్నా కూడా ఏమాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ ఇబ్బంది పడటం లేదు. అందుకే ఈ స్థాయిలో కలెక్షన్స్‌ వస్తున్నాయని సినీ వర్గాల వారు అంటున్నారు.

మరిన్ని వార్తలు:

సాహోలో మందిరాబేడీ

వ‌ర్మ త‌రువాత రాజ‌మౌళి

పూరి కూతురు ఎంట్రీ…