జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తప్పు చేసారా అని కొందరు రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన వెనుక ఎంత పెద్ద మాస్టర్ ప్లాన్ వున్నా, పవన్ వెంటనే స్పందించకుండా ఉండాల్సింది కాదు అని కొందరు రాజకీయ విశ్లేషకుల అంచనా. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమస్యల ఫై కంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై ఎక్కువగా ఫోకస్ చేసారని చెప్పాలి. అందుకేనేమో రాజధానులు ప్రకటన వెంటనే పవన్ సోషల్ మీడియా లో జగన్ ని ఏకి పారేశారు.
అయితే పవన్ వ్యాఖ్యలతో జనసైనికులు కూడా కంగుతిన్నారనుకుంటా, జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం జీఎన్ రావు నివేదిక బయటికి వచ్చాక స్పందిస్తామని మరొకమారు అన్నారు. అయితే సమస్య అంతంత మాత్రంగా వున్నపుడు ప్రజల వద్దకు వెళ్లిన పవన్, ఇపుడు అమరావతి నిరసన సెగలతో మండుతూ ఉంటే తర్వాత అంటూ పోస్ట్ పోన్ చేసారు. అయితే పవన్ కి ఈ విషయంలో జరగాల్సిన నష్టం జరిగిందని కొందరు అభిప్రాయం పడుతున్నారు. అంతేకాదు, ఈ నెల ముప్పై న విస్తృత స్థాయి సమావేశం అంటూ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో అమరావతి ప్రస్తావన ఉన్నా, ఇప్పుడు స్పందిస్తేనే రైతుల కు అండగా ఉన్నట్లు ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఆఖరికి నిర్ణయం తీసుకున్నాక స్పందిస్తే ఏం లాభం అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. మరి పవన్ మళ్ళీ తప్పు చేస్తారో, లేదో వేచి చూడాలి.