ముఖ్యమంత్రి జగన్ పైన జనసేన అధినేత పవన్ కళ్యాన్ తీవ్రంగా మండిపడ్డారు. తన పైన వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సీఎం తాను వైసీపీ నేతను కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. తన మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్న జగన్ కావాలంటే ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చన్నారు.
ఇలాగే మాట్లాడుతాం విజయవాడలో గొడవపడదాం అంటే తాను సిద్దమని స్పష్టం చేసారు. తనను తిట్టించాలంటే ఒకే వర్గానికి చెందిన వారితో తిట్టిస్తున్నారని గత ఎన్నికల్లో కాపులు ఎక్కువగా జగన్ కే ఓట్లు వేసారని గుర్తు చేసారు. ఇంగ్లీషు మీడియం అమలుకు ముందు పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తమను తిడితే భరించటానికి టీడీపీ కాదని జనసేన బలం తక్కువగా అంచనా వేయవద్దని పవన్ హెచ్చరించారు.
ముఖ్యమంత్రి జగన్ మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారని, మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారన్నారు. తాను 3 పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా అని జగన్ ఉద్దేశించి పవన్ ప్రశ్నించారు. గోదావరి జిల్లాలోని కాపులు ఎక్కువగా మీకే ఓట్లు వేసారనే విషయం గుర్తుంచు కోవాలని సూచించారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ను చూసుకొని రెచ్చిపోతున్నారని జగన్ కు అటు ఇటుగా ఏదైనా జరిగినే వారి పరిస్థితి ఏంటనేది గుర్తించాలని హెచ్చరించారు.