పొగడ్తలతో జగన్ ని ఇరికించిన పవన్.

Pawan Kalyan Intelligent Speech on Jagan
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
 కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన సవాల్ ని స్వీకరించి జనసేన అధినేత పవన్ పెద్ద షాక్ ఇచ్చాడు. సవాల్ ని స్వీకరించడం అంటే మొక్కుబడి వాగ్బాణాలు , తొడ కొట్టుడులు కాకుండా తెలివిగా జగన్ ని ఇరికించేశాడు పవన్ . జగన్ ధైర్యాన్ని , పట్టుదలని పొగిడేసి వైసీపీ అవిశ్వాస తీర్మానం పెడితే తాను మద్దతు కూడగడతానని పవన్ మెలిక పెట్టాడు. దీంతో ఏ సవాల్ తో రాజకీయ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ భావించాడో అదే సాలెగూడులో ఇరుక్కుపోయాడు. బీజేపీ ప్రాపకం కోసం ఏ స్థాయిలో అయినా లొంగిపోడానికి సిద్ధపడ్డ జగన్ ఇప్పుడు అవిశ్వాసం అంటే పరిస్థితి ఎక్కడికి దిగజారుతుందో అందరికీ తెలుసు.

నిజానికి ఈ ఎపిసోడ్ లో పవన్ తెలివితేటలు కన్నా జగన్ అమాయకత్వమే ఎక్కువగా కనిపిస్తోంది. రాజకీయాల్లో వ్యూహాలు మాత్రమే కాదు . ప్రతి వ్యూహాలు కూడా ఉంటాయి. ఈ విషయం మరిచిపోయి ఎన్నో సార్లు జగన్ పప్పులో కాలేశారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. పవన్ స్పందన తర్వాత అవిశ్వాసం పెట్టడానికి వైసీపీ చొరవ తీసుకోకపోతే ఆంధ్రుల దృష్టిలో జగన్ ఇంకో సారి ద్రోహిగా మిగిలిపోతాడు. ఒకవేళ పెట్టే ప్రయత్నం చేస్తే మోడీ , అమిత్ షా ఆగ్రహం చవిచూడాల్సివస్తుంది. ఈ పరిణామాల్ని ఊహించి ఎత్తుగడలు , ప్రకటనలు చేసి వుండాల్సింది. అలా కాకుండా చేయడం వల్లే పవన్ కి అడ్వాంటేజ్ తెచ్చిపెట్టారు. పవన్ పేరు ఎత్తితేనే విరుచుకుపడే కత్తి లాంటి వాళ్ళు సైతం ఈ ఎపిసోడ్ లో ఆయన్ని నెత్తికి ఎత్తుకోవడం వెనుక ఇంకెవరో లేరు …జగన్ పసలేని వ్యూహాలు , ఆలోచన లేని ప్రకటనలు తప్ప.