హీరోయిన్లే అర్ధ‌రాత్రి నిర్మాత‌ల ద‌గ్గ‌రకు వెళ్తున్నారు….

Ektha Kapoor Sensational Controversial Comments On Casting Couch
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాస్టింగ్ కౌచ్..భాష‌తో సంబంధం లేకుండా అన్ని చిత్రప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఈ ప‌దం ఇటీవ‌లికాలంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌యింది. హీరోయిన్లంద‌రని ఇంట‌ర్వ్యూల‌లో కాస్టింగ్ కౌచ్ గురించి ప్ర‌శ్నించ‌డం సాధార‌ణ‌మైపోయింది. హాలీవుడ్,బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడాలేకుండా ఎంద‌రో న‌టీమ‌ణులు కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. వారంద‌రూ ఎక్కువ‌గా టార్గెట్ చేసింది  నిర్మాత‌లు, న‌టుల‌నే. ఈ క్ర‌మంలో కొన్నిరోజుల పాటు సోష‌ల్ మీడియాలో దీనిపై పెద్ద చ‌ర్చే జ‌రిగింది. ఏ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోనైనా కాస్టింగ్ కౌచ్ స‌ర్వ‌సాధార‌ణ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌యింది.
ఈ గొడ‌వ ఇప్పుడిప్పుడే కాస్త స‌ద్దుమణుగుతున్న టైంలో కాస్టింగ్ కౌచ్ సంస్కృతిపై బాలీవుడ్ మ‌హిళా నిర్మాత‌,  బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తాకపూర్ సంచ‌ల‌న‌వ్యాఖ్య‌లు చేసింది. ఈ అంశంలో నిర్మాత‌ల‌నే ఎందుకు బాధ్యుల‌ను చేస్తున్నార‌ని ప్ర‌శ్నించిన ఏక్తాక‌పూర్ హీరోయిన్ల‌పై అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేసింది. చాలా మంది హీరోయిన్లు అవ‌కాశాల కోసం త‌మంత‌టతామే నిర్మాత‌ల ద‌గ్గ‌రకు వెళ్తారని వ్యాఖ్యానించింది. ప‌వ‌ర్, పొజిష‌న్ లో ఉన్నారుక‌దాని నిర్మాత‌ల‌ను నిందించ‌డం స‌రికాద‌ని హిత‌వు ప‌లికింది.
ఒక హీరోయిన్ అర్ధరాత్రి నిర్మాత‌ను క‌లిసి, త‌ర్వాతి రోజు త‌న‌కు సినిమాలో అవ‌కాశం ఇవ్వ‌మంటే తప్పెవ‌రిద‌ని, ఆ సినిమాలో ఆమెకు సెట్ అయ్యే పాత్ర లేన‌ప్పుడు దోషిగా ఎవరిని నిల‌బెట్టాల‌ని నిల‌దీసింది. ఏక్తా వ్యాఖ్య‌లు బాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప‌లువురు హీరోయిన్లు ఏక్తా వ్యాఖ్య‌ల‌పై మండిప‌డుతున్నారు.