అమరావతి పర్యటన లో పవన్ ఉగ్రరూపం చూడాల్సి వస్తుంది. ప్రజాసమస్యలని తెలుసుకొనేందుకు బయలుదేరిన పవన్ కళ్యాణ్ కి కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అమరావతి రైతులు దాదాపు 14 రోజుల నుండి రాజధాని తరలింపు విషయం లో ఆందోళన చేస్తూనే వున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రైతుల ఆందోళనకు మద్దతు తెలపడమే కాకుండా, పోరాటాన్ని ఆపొద్దు అంటూ సలహా కూడా ఇచ్చారు.
అయితే కృష్ణయ్య పాలెం నుండి మందడం బయలుదేరిన పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని ఆపడం తో అక్కడ పర్యటన లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ అభిమానులు, రైతులు భారీ ఎత్తున ఈ పర్యటన లో పాల్గొనడం జరిగింది. అయితే పవన్ ఇక్కడినుండి పాదయాత్రగా మందడం చేరుకోనున్నారు. దాదాపు 200 మంది పోలీసులు పవన్ ని అడ్డుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ మాత్రం రైతుల్ని కలిసేందుకు పాదయాత్రగా బయలుదేరారు. అంతేకాకుండా రైతుల్ని కలవకుండా నన్ను ఎవరు ఆపుతారో నేను చూస్తాను అంటూ పవన్ ముందడుగు వేశారు.
పరామర్శ కోసం అని బయల్దేరుతుంటే పవన్ పాదయాత్ర చేపట్టేలా చేసినందుకు కొందరు జగన్ కి కృతజ్ఞతలు చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ ఈ సమయం లో మందడం మీదుగా వెళ్లాల్సి ఉందని పోలీసులు చెప్పడం తో పవన్ అక్కడే వేచి ఉండడం జరిగింది. ఈ పర్యటన లో పోలీసులకి వ్యతిరేకంగా మహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. పవన్ ని అడ్డుకోవడం పట్ల జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.