జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో, రాజకీయాల్లో బిజీ గా వున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి 2019 ఎన్నికల ముందు వరకు చాల వ్యాఖ్యలు చేసారు. అయితే అవి నిలబెట్టుకోవడం లో రకరకాలుగా విఫలమయ్యారు. సినిమా లే కానీ, రాజకీయాలే కానీ స్థిరత్వం లేకపోవడం, అనేది అందరిలో మెదిలే ప్రశ్న. అయితే ప్రస్తుతం జనసేన పార్టీ లోని ముఖ్య నాయకులు ఒక్కొక్కరు పార్టీ ని వీడుతున్నారు. పార్టీ మొదటి నుండి పని చేసిన రాజు రవితేజ అయినా, జేడీ లక్ష్మి నారాయణ అయినా, భవిష్యత్ లో మరొకరు ఎవరైనా.
అయితే పవన్ ఏ ఒక్కరి కోసమో పార్టీ ని పెట్టి నడపడం లేదు. బీజేపీ తో పొత్తు వలన పవన్ తన పార్టీ సిద్ధాంతాలకు తూట్లు పొడిచారని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రం లో వున్న పాలన పట్ల పలు చోట్ల ముఖ్యమంత్రి జగన్ ఫై వ్యతిరేకత ఏర్పడుతుంది అని టీడీపీ, బీజేపీ, జనసేన నేతల వ్యాఖ్యలు. పరిపాలన వికేంద్రీకరణ మరికొన్ని బిల్లుల రూపం లో కార్యరూపం దాల్చితే పవన్ రాజకీయ మనుగడకు ముప్పు వస్తుందని భావించే బీజేపీ తో పొత్తు పెట్టుకున్నట్లు కొందరి వాదన. మరి ప్రశ్నించడానికి వచ్చిన పవన్ ఇపుడేం చేస్తున్నారనేది అసలు ప్రశ్న.