మళ్లీ వేసేసిన పవన్ టీమ్

pawan kalyan jana sena Team satire On venkayya naidu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అసలు యాక్టివ్ పొలిటీషియనే కాదు. సరిగ్గా క్యాడర్ లేదు. రెగ్యులర్ గా రాజకీయ వ్యాఖ్యానాల్లేవు. ఇంతవరకూ ప్రజల్లోకి వెళ్లింది లేదు. కానీ వెంకయ్యకు ఉఫరాష్ట్రపతి పదవి తమ పుణ్యమేనని జనసేన బ్యాచ్ చంకలు గుద్దుకుంటోంది. అసలు వెంకయ్య అనుభవానికి, పవన్ మద్దతుకు ఏం సంబంధం ఉందని బీజేపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

అప్పుడెప్పుడో ఉత్తరాది, దక్షిణాది పవన్ ట్విటర్ పిట్ట కూసింది. దీనిపై వెంకయ్యే రియాక్టై ఘాటుగా బదులిచ్చారు. ఇప్పుడదే వెంకయ్యకు దక్షిణాది కోటాలోనే ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వం దక్కిందని పవన్ బ్యాచ్ ప్రచారం చేస్తోంది. నిజానికి వెంకయ్య రేంజ్ కు ఉఫరాష్ట్రపతి పదవి చిన్నదే. ఆయన ప్రెసిడెంట్ కావాల్సినవాడిని సన్నిహితుల అభిప్రాయం.

కానీ దూరం ఆలోచించే అలవాటు లేని జనసేన బ్యాచ్ మాత్రం తామే హీరోలమని గొప్పలు చెప్పుకుంటున్నాయి. వెంకయ్యకు వీళ్లు ఉపరాష్ట్రపతి పదవి ఇప్పించడమేంటని జనం కూడా నవ్వుకుంటున్నారు. పవన్ టీమ్ ఇప్పటికైనా ఇలాంటి కామెడీ మాటలు మానుకోకపోతే.. పవన్ ఏం మాట్లాడినా కామెడీయే మిగులుతుంది చివరకు.

మరిన్ని వార్తలు

ప్రశాంత్ టీం ఆ తప్పే చేస్తోంది.

రోజాకి 10 లక్షల కోట్లు కనిపిస్తున్నాయి.