రోజాకి 10 లక్షల కోట్లు కనిపిస్తున్నాయి.

MLA Roja comments on Ysrcp Manifesto

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తన నోటి దూకుడుతో ఇప్పటికే ఎన్నో సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ దూకుడు తగ్గించుకోమని సాక్షాత్తు అధినేత జగన్ హెచ్చరించడంతో ఆమె కాస్త హర్ట్ అయ్యారు కూడా. అయితే మళ్లీ అధినేత నమ్మకాన్ని పొందడానికి ఆమె తన వాగ్ధాటిని నమ్ముకుంది. అయితే ఆ అత్యుత్సాహంలో ఆమె మరోసారి నోరు జారింది. తన అవగాహనరాహిత్యాన్ని బయటపెట్టుకుంది. దీంతో పాటు వైసీపీ కి ఇంకొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇక తాను తూర్పారబట్టే టీడీపీకి ఇంకో అస్త్రం అందించింది.

ఇటీవల వైసీపీ ప్లీనరీలో నవరత్నాలు అంటూ జగన్ తమ పార్టీ మానిఫెస్టోలో ఉండబోయే కీలక పథకాల్ని ప్రకటించారు. ఆ పధకాల అమలుకు డబ్బెక్కడ అని విమర్శలు రాగానే రోజా కౌంటర్ కి రెడీ అయిపోయింది. 2019 నాటికి ఏపీ బడ్జెట్ దాదాపు 10 లక్షల కోట్లకి చేరుకుంటుందని రోజా ప్రకటించారు. రాష్ట్ర,దేశ ఆర్ధిక పరిస్థితుల మీద కనీస అవగాహన వున్న వారికి ఎవరికైనా ఇదెంత కామెడీ స్టేట్ మెంట్ అన్నది అర్ధం అవుతుంది. సరే ఆమె మాట నిజమే అనుకున్నా ఆ 10 లక్షల కోట్ల క్రెడిట్ అధికారంలో వున్న టీడీపీ కే చెందుతుంది. ఈ విషయాన్ని మరిచి జనాన్ని తక్కువ అంచనా వేసి రోజా తేలిగ్గా 10 లక్షల కోట్ల మాట చెప్పేసి ఇప్పుడు మ్యాటర్ అర్ధం అయ్యాక నాలుక కరుచుకుంటోంది.

మరిన్ని వార్తలు 

జేపీ యాత్ర ఎందుకు ?

ఇష్టం లేకున్నా తప్పదు వెంకయ్య జీ

డ్రగ్స్ కేసు సీరియస్సా.. జోకా..?