ఇష్టం లేకున్నా తప్పదు వెంకయ్య జీ

Union Minister Venkaiah Naidu in Vice President Race Here

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అమితా షా బీజేపీ అధినేత అయ్యాక వెంకయ్యకు గడ్డుకాలం మొదలైంది. మొన్నటిదాకా ఆడింది ఆట, పాడింది పాటగా సాగించుకున్న వెంకయ్యకు అమిత్ చెక్ పెట్టారు. కనీసం మోడీ భజనతో క్యాబినెట్ లో అయినా కాస్తోకూస్తో పనులు అవుతున్నాయి. పార్టీ కి సంబంధించి మాత్రం మీరు జోక్యం చేసుకోవద్దని అమిత్ షా ఖరాఖండీగా చెప్పడం వెంకయ్యకు ఎప్పట్నుంచో అశనిపాతమైంది.

ఉపరాష్ట్రపతి రేస్ లో వెంకయ్య పేరు అనూహ్యంగా తెరపైకి వస్తోంది. కానీ వెంకయ్యకు మాత్రం ఉపరాష్ట్రపతి పదవి ఇష్టం లేదట. ఆ పదవి అలంకార ప్రాయమే తప్ప.. పెద్దగా ఉపయోగం లేదు. దీనికి తోడు చాలా పరిమితులున్నాయి. అందుకే ఉపరాష్ట్రపతి పదవికి వెళ్లకుండా ఉండటానికి వెంకయ్య ట్రై చేస్తున్నా.. అమిత్ షా మాత్రం చాలా గట్టిగా ఉన్నారట.

ఉద్దేశపూర్వకంగా రకరకాల పేర్లు ప్రచారంలోకి తెచ్చి.. చివరకు వెంకయ్యను దించుతారనే మాట వినిపిస్తోంది. కానీ అమిత్ షా మాత్రం ఏపీలో బీజేపీ ఎదగాలంటే.. వెంకయ్యే అడ్డమని, ఆయన్ను తప్పిస్తేనే టీడీపీకి కూడా ఇబ్బందులు సృష్టించవచ్చని భావిస్తున్నారు. అందుకే వెంకయ్య కూడా ఎంత ప్రయత్నిస్తున్నా.. పని అయ్యేలా లేదని ఆయన వర్గం తెగ బాథపడిపోతుందట.

మరిన్ని వార్తలు

తలాక్ తర్వాత.. తాళి సంగతి తేల్చు

పుట్టినరోజు నుంచి పవన్ రథయాత్ర