జేపీ యాత్ర ఎందుకు ?

loksatta jayaprakash narayan padyatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోక్ సత్తా రాజకీయ ప్రస్థానాన్ని ఆపేసిన జయప్రకాశ్ నారాయణ ఇంకో ప్రయత్నం చేయబోతున్నారు. కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్న ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 100 రోజులు యాత్ర చేయబోతున్నట్టు తెలుస్తోంది . ఇది పాదయాత్రా లేక రధయాత్రా అనేది ఇంకా తెలియడం లేదు. జేపీ హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై భిన్నభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ “వామపక్షాలు, జనసేన, లోక్ సత్తా కలిసి ఆంధ్రాలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. దానికి సన్నాహకంగానే జేపీ యాత్ర చేయబోతున్నట్టు కొందరి ఆలోచన. మరికొందరు మాత్రం ముఖ్యంగా అధికార పార్టీ అభిమానులు జేపీ యాత్ర మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కి మేలు చేసే ఉద్దేశం ఉందని వారి సందేహం. వాళ్ళు ఇలా డౌట్ పడేందుకు కొన్ని పాత అనుభవాలు కూడా ఓ కారణం.

ఓ ఐఏఎస్ అధికారిగా జయప్రకాశ్ నారాయణ చెప్పుకోదగ్గ విజయాలే సాధించారు. అంతకన్నా లోక్ సత్తా అధినేతగా రాజకీయ వ్యవస్థని మార్చడానికి ఆయన చేసిన ప్రయత్నం గొప్పది. అయితే అక్కడ వైఫల్యమే ఎదురైంది. దాని వల్ల జేపీకి అంతకుముందున్న పేరు ప్రతిష్టలు కొంత వరకు దెబ్బ తిన్నాయి. వైఫల్యం వల్ల మాత్రమే జేపీ ప్రతిష్టకు మచ్చ వచ్చింది అనుకోడానికి వీల్లేదు. లోక్ సత్తా అధినేతగా ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితాలు కూడా అందుకు ప్రధాన కారణం. ఉదాహరణకి 2009 ఎన్నికల రిజల్ట్ మారిపోడానికి ఓ విధంగా లోక్ సత్తా కూడా కారణమే. ఆ ఎన్నికల్లో బొటాబొటీ మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది. గెలిచాక అంతా వై.ఎస్ పధకాలకి ఆ విజయాన్ని ఆపాదించారు. ఇక విశ్లేషకులు కొందరు ప్రజారాజ్యం వల్లే టీడీపీ ఓటమి పాలైందని అన్నారు. ప్రజారాజ్యం వల్ల గోదావరి, ఉత్తరాంధ్ర లో టీడీపీ కి ఎంత నష్టం జరిగిందో దక్షిణ కోస్తాలో అంత మేలు జరిగింది. ఈ విషయాన్ని మర్చిపోయినట్టు ప్రవర్తించారు. నిజానికి ఆ ఎన్నికల్లో లోక్ సత్తా చీల్చిన కొద్దిపాటి ఓట్లు టీడీపీ ని గెలుపు ముంగిట నిలువరించాయి. దాదాపు 60 నియోజకవర్గాల్లో లోక్ సత్తా చీల్చిన ఓట్లు, టీడీపీ ఓడిపోయిన ఓట్ల తేడాతో సరిపోయింది.

అలా 2009 లో టీడీపీ విజయాన్ని అడ్డుకుని కాంగ్రెస్ గెలవడానికి లోక్ సత్తా పరోక్ష కారణం అయ్యింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు కూడా జేపీ వ్యవహారశైలి మీద విమర్శలు వచ్చాయి. ఆయన దూకుడు, విమర్శలు మెత్తగా ఉండేవారి మీదే తప్ప ఎదురుదాడి చేసే వారి మీద కాదని అంటుంటారు. ఈ విమర్శలని జేపీ నిజం చేసిన సందర్భాలు లేకపోలేదు. ఇన్ని లోటుపాట్లు వెనుక వేసుకుని ఇప్పుడు జేపీ ఆంధ్రాలో టూర్ తలపెట్టారు .దాని లక్ష్యం ఏమిటో ?

మరిన్ని వార్తలు 

తమిళనాడులో నిప్పులాంటి మనిషి

ప్రియాంకను కోరుకుంటున్న ప్రతిపక్షాలు

ఆర్కే కి ఫైనాన్స్ చేస్తోంది వీళ్లేనా?