పొలిటీషియన్‌గా బిజీ అయిన తర్వాత గడ్డం పెంచుకుని మాత్రమే కనిపిస్తోన్న పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదని డిసైడ్ అయినా కానీ దిల్ రాజు ఇచ్చిన ఆఫర్‌ని కాదనలేక ‘పింక్’ రీమేక్ చేయడానికి అంగీకరించాడు. తమిళంలో అజిత్ కుమార్ చేసిన వెర్షన్‌ని పవన్‌కళ్యాణ్‌తో చేస్తున్నారు. అందులో అజిత్ కనిపించినట్టుగానే పవన్ కూడా ఇందులో గడ్డంతోనే కనిపిస్తాడు. అయితే అది తెల్ల గడ్డమా లేక సాల్ట్ అండ్ పెప్పర్ లుక్కా అనేది ఇంకా ఫిక్స్ అవలేదు.
పవన్ అయితే ఎప్పుడూ తన గడ్డానికి రంగు వేసి కనిపిస్తాడు కనుక అదే గెటప్ వుంటుందని అంటున్నారు. ఇకపోతే ఫ్లాష్‌బ్యాక్ సీన్లో పవన్ ఎలా కనిపిస్తాడనేది ఇంకా ఫిక్స్ అవలేదు. ఈ చిత్రానికి పవన్ ఇరవై రోజులే డేట్స్ ఇచ్చాడనేది పూర్తిగా నిజం కాదు. ఇరవై రోజుల్లో ముందుగా కోర్టు రూమ్‌లో జరిగే సీన్లని చిత్రీకరిస్తారు. ఆ తర్వాత ఫైట్‌తో పాటు ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఫిబ్రవరి, మార్చిలో పవన్ నటించే సన్నివేశాలు పూర్తి చేస్తారు.
ఏప్రిల్‌లోగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే నెలాఖరులో విడుదల చేయాలని, తద్వారా సమ్మర్ సీజన్‌ని క్యాష్ చేసుకోవాలని దిల్ రాజు ప్రణాళిక వేసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఎంత సహకరిస్తాడు, డీవియేషన్స్ లేకుండా ఎంత త్వరగా తన పని పూర్తి చేస్తాడు అనేదానిపై ఫైనల్ రిలీజ్ డేట్ ఖరారు చేస్తారు.