పవన్ కేంద్రాన్ని మాత్రం ప్రశ్నిస్తాడు.

pawan kalyan master plans for padayatra in Andhra Pradesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా పనుల్లో మాత్రమే వున్నాడు అనుకుంటే పొరపాటే. పార్టీ నిర్మాణం మీద పూర్తిగా దృష్టి పెట్టడమే కాదు త్వరలో జనంలోకి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. జనవరి లేదా ఫిబ్రవరి లో ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర మొదలు పెట్టడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నాడు. పాదయాత్ర రూట్ మ్యాప్, షెడ్యూల్ కి సంబంధించి జనసేన కోర్ టీం తో పవన్ విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర కు సంబంధించి ప్రాధమికంగా ఓ అవగాహనకు వచ్చారు. ఈ పాదయాత్రలో పవన్ ప్రస్తావించే అంశాలు ఏమిటి అన్నదానిపై ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి.

పవన్ పాదయాత్ర ఆసాంతం విభజన సమయంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీలు గురించి మాత్రమే ప్రధానంగా దృష్టి పెడతారు. ప్రత్యేక హోదా , పోలవరం సహా నిధులు, కేటాయింపులకు సంబంధించి మోడీ సర్కార్ మోసం చేసిన ప్రతి విషయాన్ని పవన్ జనంలోకి తీసుకెళ్లే అవకాశాలు వున్నాయట. రాష్ట్ర సర్కార్ మీద పెద్దగా టార్గెట్ చేసే అవకాశాలు లేవని కూడా తెలుస్తోంది. ప్రత్యేక హోదా సాధన దిశగా మొత్తం పాదయాత్ర రూకల్పన చేసినట్టు సమాచారం. పాదయాత్ర చేసేటప్పుడు హఠాత్తుగా కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమ రూపంలో ఆంధ్రుల మనోభావాలు వివరించే ఆలోచన కూడా ఉందట. తెలంగాణ ఉద్యమ తరహాలో కేంద్రాన్ని నిలదీసేందుకు పవన్ చేసే ప్రయత్నం సక్సెస్ అయితే ప్రధాని మోడీకి ఇబ్బందులు తప్పవు.