జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష పేరుతో నిరసన చేపట్టారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాట ధర అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యం లో పవన్ ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ దీక్షకు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా హారయ్యారు. పవన్ పక్కనే కూర్చొని దీక్షని ప్రారంభించారు.
ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం ఫై చాల విమర్శలు చేసారు. జగన్ ప్రజలకు సరైన పాలన అందించడం లేదని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని జగన్ రెడ్డి అంటూ సంబోధిస్తూ గతంలో చాల విమర్శలు చేసారు. ఇసుక కొరత ఫై, ఆంగ్ల మాధ్యమం ఫై పోరాటాన్ని సాగించి ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. అయితే ఇపుడు చేస్తున్న దీక్ష కూడా అలాంటిదే. రైతుల తరపున తన గొంతుకని ప్రభుత్వానికి తెలియజేయడమే మాత్రమే కాకుండా గిట్టుబాటు ధరని ఇవ్వాల్సిందిగా పవన్ డిమాండ్ చేయనున్నారు.