పింక్ చిత్రాన్ని తెలుగులో చేస్తున్న పవన్ కళ్యాణ్

పింక్ చిత్రాన్ని తెలుగులో చేస్తున్న పవన్ కళ్యాణ్

ప్రస్తుతానికి వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హిందీలో విజయం సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. దానితో పాటె క్రిష్ దర్శకత్వం లో కూడా ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. నిత్యం విభిన్న కథలతో చిత్రాన్ని తెరకెక్కించే సంచలనాల దర్శకుడు క్రిష్ పవన్ తో చేయబోయే చిత్రాన్ని కూడా అదే తరహాలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. కాగా ఔరంగజేబు కాలంనాటి కథతో క్రిష్ ఈ మూవీ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి సంబందించిన మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయిందని, తదుపరి షెడ్యూల్ ని కూడా త్వరలోనే ప్రారంభించనున్నారని సమాచారం.

అయితే ఈ చిత్రానికి మూలం ఒక తిరుగుబాటుదారునికి సంబంధించినదే అయినప్పటికీ కూడా ఈ చిత్రంలో కథానాయకుడి ప్రేమే కీలకం కానున్నదని సమాచారం. పవన్ మార్క్ ఎంటర్టెయిన్మెంట్, యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలంగా ఉండేలా కథను సిద్ధం చేశారంట దర్శకుడు క్రిష్. అయితే కథానాయకుడి పాత్ర కి తగ్గట్టుగానే ఈ చిత్రానికి వీరూపాక్షి అనే టైటిల్ పెట్టనున్నారని సమాచారం. కాగా ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకరాడానికి సన్నాహాలు చేస్తున్నారు.