అమ్మాయిల రక్షణ కోసం సినిమా తీస్తున్న వర్మ

అమ్మాయిల రక్షణ కోసం సినిమా తీస్తున్న వర్మ

వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళారు. తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన దిశ హత్య కేసుపై వర్మ ఒక సినిమాను చేస్తున్నట్టు ప్రకటించాడు. అందులోనే భాగంగా నేడు శంషాబాద్ ఏసీపీనీ కలిసి ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాడు.

అయితే దిశ ఎఫ్ఐఆర్ నమోదు నుంచి, నిందితులను పట్టుకున్న తీరు, నింధితుల ఎన్‌కౌంటర్ వరకు అన్ని అంశాలను పూర్తిగా తెలుసుకున్నాడు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి కొన్ని ముఖ్య ఆధారాలను కూడా పోలీసుల దగ్గర నుంచి సేకరించాడు. అయితే దీనిపై దిశ తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకున్నారా అని వర్మను అడగగా, ఈ సినిమా తీయడానికి ఎవరి అనుమతి తనకు అక్కర్లేదని, సినిమా తీసే స్వేచ్చ తనకు ఉందని చెప్పుకొచ్చాడట. అయితే వర్మ ఈ సినిమా అనౌన్స్ చేసిన చేసిన వెంటనే నలుగురు నిందితులలో ఒకడైన చెన్నకేశవులు భార్యను పిలిపించుకుని మాట్లాడిన సంగతి తెలిసిందే.