పవన్ తోటను మర్చిపోయారా…లేక…!

Pawan Kalyan Comments On Chiranjeevi Praja Rajyam Party

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రజా పోరాట యాత్ర లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం వచ్చారు. ఇంకేముంది పవన్ రొటీన్ గా చంద్రబాబు, జగన్ లపై తన విమర్శల దాడి కొనసాగించారు. అదేంటో కానీ స్థానిక సమస్యలు కానీ స్థానిక ఎమ్యెల్యే పనితీరు పై నామమాత్రంగా కూడా ప్రస్తావన లేకుండా తన ప్రసంగాన్ని సాగించారు. ఎక్కువ సేపు తెలంగాణ నేతలు ఆంధ్రులను తిడుతుంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు, జగన్ లు ధైర్యంగా ఎదురు నిలవలేదని కేవలం జనసేన గా తాను మాత్రమే ఎదురు నిల్చున్నానన్నారు. తనకు గ్రామ గ్రామానా తెలంగాణాలో జనసైనికులు ఉన్నారన్న పవన్ అక్కడ ఎందుకు పోటీ కి నిర్ణయం తీసుకోలేదో క్లారిటీ ఇవ్వలేదు సరి కదా. ప్రసంగం మొత్తం తెలంగాణ నేతల మాటల దాడి గుర్తు చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కానీ ప్రతిచోటా స్థానిక ఎమ్యెల్యేలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే పవన్ తోట త్రిమూర్తులు పై ఎలాంటి విమర్శలు చేస్తాడన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో ఏర్పడింది.

Thota-Trimurthulu-MLA-of-RA

దీనికి అనేక కారణాలు వున్నాయి కూడా. గతంలో ప్రజారాజ్యం పార్టీ ని చిరంజీవి స్థాపించినప్పుడు ఆ పార్టీలోకి వెళ్లిన తోట ఈసారి కూడా జనసేన వెంట నడుస్తారన్నది బలంగా వినిపిస్తున్న మాట. అయితే ఆ ముహూర్తం ఎప్పుడన్న చర్చ రోజు కొనసాగుతూనే వుంది. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్యెల్యే గా వున్న తోట త్రిమూర్తులు ఎన్నికల ముందు మాత్రమే జనసేన లోకి వస్తారన్న టాక్ కూడా వుంది. అయితే ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి స్థాపించినప్పుడు మెగాస్టార్ కి తలలో నాలుకలా వ్యవహరించిన ప్రస్తుత వైసిపి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు గుర్తొచ్చేశారు పవన్ కళ్యాణ్ కి. తన అన్న దగ్గరకు సాధారణ స్కూటర్ పై వచ్చిన కన్నబాబు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారంటూ విమర్శలు చేశారు. కన్నబాబు కులాన్ని అడ్డుపెట్టుకుని గెలిచారని చిరంజీవిని అడ్డుపెట్టుకుని ఎలా బాగుబడింది చెప్పుకొచ్చారు. ఆ ఆస్తులన్నీ బయట పెడతానని చెప్పుకొచ్చారు. అయితే కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గాలు అత్యధికంగా వుండే రామచంద్రాపురం నియోజకవర్గంలో రెండు కులాలను ఆకట్టుకునేలా పవన్ తన ప్రసంగం సాగించారు. మొత్తానికి ఎమ్యెల్యే తోట మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో ఒక శుభముహూర్తాన టిడిపి ఎమ్యెల్యే పచ్చపార్టీ కండువా వీడి జనసేన జెండా కప్పుకుంటారా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.

janasena-party