తెలంగాణ ఎన్నికల స్పెషల్: తెలంగాణ జన సమితి లో ఇంకో రెండు స్థానాలే బాకీ

The List Of TJS Party Candidates Was Adjourned Wednesday

తెలంగాణ జన సమితి అంటూ తెరాస కి వ్యతిరేకంగా పార్టీ ని పెట్టి, మహాకూటమి పొత్తుతో రాబోవు తెలంగాణ ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్న కోదండరాం, తాను డిమాండ్ చేసిన 8 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నుండి అంగీకారం సాధించుకున్నారు. అయితే ఈ 8 స్థానాల్లోని 6 స్థానాల పోటీ పై స్పష్టత వచ్చినట్లు కోదండరాం తెలిపారు. ఆ ఆరు స్థానాలైన మల్కాజగిరి, అంబర్‌పేట, మెదక్, దుబ్బాక, వర్ధన్నపేట, సిద్ధిపేట లలో టీజేఎస్ అభ్యర్థులు పోటీచేస్తారని టీజేఎస్ అధ్యక్షుడు వెల్లడించారు. దీనివలన ఇప్పటికే విడుదల కావాల్సిన టీజేఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటన బుధవారం కి వాయిదా పడింది. కాగా ఈ ఆరు నియోజకవర్గాలలో మెదక్ నుండి జనార్ధనరెడ్డి, సిద్ధిపేట నుండి భవాని, మల్కాజగిరి నుండి కపిలవాయి దిలీప్ కుమార్ లు అభ్యర్థులుగా ఖరారు అయినట్లుగా ఖచ్చితమైన సమాచారం తెలుస్తుంది.

The-List-Of-TJS-Party-Candi

ఇంకా మిగిలినవి రెండు స్థానాలే ఉన్నా, ఏ ఏ స్థానాలను టీజేఎస్ కి కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందో అనేది ఇప్పటికి తెలియని విషయమే. తొలుత జనగామ నుండి కోదండరాం పోటీ చేస్తున్నట్లుగా సమాచారం వచ్చినా, ఆ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కి చెందిన పొన్నాల లక్ష్మయ్య కావడంతో ఇప్పుడే ఆ స్థానంలో తన పోటీ విషయం గురించి మాట్లాడడం సబబు కాదని కోదండరాం అభిప్రాయపడ్డారు. మిగిలిన రెండు స్థానాలకు గాను మేడ్చల్, తూర్పు వరంగల్, మిర్యాలగూడ స్థానాలలో ఏదోకటి కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇవి కాకుండా టీజేఎస్ బీసీ, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ లు ప్రాతినిధ్యం వహించేలా మరో మూడు స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ ని అడగనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితా పైన విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, జనగామ టిక్కెట్ ని పొన్నాల లక్ష్మయ్య ని కాదని ఇంకెవరికి ఇచ్చిన ఆ నియోజకవర్గం అంతటా అల్లకల్లోలం జరుగుతుందని పొన్నాల అభిమానులు హెచ్చరికలు చేస్తున్న ఈ సమయంలో కోదండరాం ఏ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించబోతున్నారో అనేది అంతటా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం.

elections