వారం రోజుల గ్యాప్‌లో బాబాయి, అబ్బాయి

Pawan kalyan Ram charan movies release One week Gap in sankranthi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
మెగా ఫ్యామిలీ హీరోలు మొదటి సారి వారం రోజుల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. నిన్న మొన్నటి వరకు పవన్‌ మూవీకి, చరణ్‌ మూవీకి కనీసం మూడు వారాల గ్యాప్‌ అయినా ఉంటుందని అంతా భావించారు. కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కేవం వారం రోజుల గ్యాప్‌తోనే బాబాయి, అబ్బాయి సంక్రాంతికి తమ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

ఇప్పటికే పవన్‌, త్రివిక్రమ్‌ల మూవీ సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. పవన్‌ బర్త్‌డే సందర్బంగా విడుదలైన పాటలో సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్‌ చేశారు. దాంతో ధృవ సినిమా మాదిరిగానే ‘రంగస్థలం’ చిత్రాన్ని కూడా డిసెంబర్‌లో చరణ్‌ తీసుకు వస్తాడని అంతా భావించారు. అయితే సుకుమార్‌ మాత్రం రంగస్థలంను సంక్రాంతికే తీసుకు రావాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాడు. పవన్‌ మూవీకి అయిదు నుండి వారం రోజులు గ్యాప్‌ ఉండేలా సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ముందు పవన్‌ మూవీ వచ్చి ఆ తర్వాత చరణ్‌ మూవీ రాబోతుంది. మొత్తానికి మెగా హీరోలు సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద ఢీ కొట్టబోతున్నారు. ఇక ఈ మెగా హీరోలతో పాటు మహేష్‌ ‘భరత్‌ అను నేను’, బాలయ్య 102వ చిత్రాలు కూడా వస్తాయనే టాక్‌ ఉంది.