నేడు రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. కాగా ఈమేరకు ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రైతుల సమస్యలపై మాట్లాడారు. రైతులు కష్టపడ్డట్లు సాధారణంగా ఎవరు కూడా కష్టపడలేరు. వారి కష్టం అంత గొప్పది. అలాంటి రైతులను నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం చాలా దారుణంగా మోసం చేస్తుందని పవన్ కళ్యాణ్ పలు విమర్శలు చేశారు. అంతేకాకుండా రైతు లేకపోతె మన జీవానికి మనుగడ లేదని వాఖ్యానించారు.
ఇకపోతే ఈమేరకు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “డ్యాములెందుకు కడుతున్నానో భూములెందుకు దున్నుతున్నానో నాకే తెలీదు. నా బ్రతుకొక సున్నా కానీ నడుస్తున్నా… వేళ్ళు కాళ్ళయి నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమైనా దక్కేది మనిషినై, అన్ని వసంతాలు కోల్పోయాను… “దేశానికి వెన్నెముక” వెన్నుదన్ను లేక కుంగి కృశించిపోతోంది…” అంటూ తన ఆవేదనని వ్యక్తం చేశారు.