జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడినుండి వస్తున్నాయ్ అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలకు వందలాది ఆంక్షలు పెట్టి అసలైన లబ్దిదారులని జగన్ ప్రభుత్వం మోసం చేస్తుంది అని పవన్ విమర్శలు చేసారు. తెలుగుదేశం పార్టీ హయం లో జన్మభూమి కమిటీ లు ఎంతగా అరాచకం సృష్టించాయో, ప్రస్తుతం వైయస్సార్ సిపి ప్రభుత్వం కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా అదే తప్పులు పునరావృతం చేస్తుంది అని పవన్ మండిపడ్డారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ పేరు రావాలని చూస్తున్న జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం విఫలమవుతోందని పవన్ విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నంగా తయారైంది అని పవన్ అన్నారు. ఎస్సి, ఎస్టీ, బీసీ, కాపు, మైనారిటీ, వర్గాలను బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ ల నుండి నిధులు మళ్లిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇటు కార్పొరేషన్ నుండి రుణాలు, సాయం పొందాలని అనుకున్నవారికి న్యాయం జరగడం లేదు, ఇటు సంక్షేమ పథకాలు నిజమైన లబ్ది దారులకు సరైన న్యాయం జరగడం లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.