చర్చనీయాంశంగా మారిన పవన్ కళ్యాణ్ మాటలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ఒక ప్రైవేట్ మీడియా తో చేసినటువంటి కొన్ని వాఖ్యలు ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. జనాలందరికి కూడా మేలు చేద్దామని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్, బుధవారం నాడు హిందువులపై ఇలాంటి సంచలనమైన వాఖ్యలు చేయడం చాలా దారుణమని, బీజేపీ ఎంపీ జీవీఎల్ జనసేన అధినేతపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే మనదేశంలో మతసామరస్యం లేకపోవడానికి హిందువులే కారణమని, ఏ గొడవలు జరిగినా కూడా హిందూ నాయకులే కారణం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనకాల రాజకీయ దురుద్దేశం కనిపిస్తుందని, తక్షణమే తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఇకమీదట ఎలాంటి తప్పులు చేయనని ప్రజలందరి సమక్షంలో క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.