మరో సారి క్లారిటీ మిస్సయిన పవన్…!

Pawan Kalyan Statistics On Twitter Followers

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న సాయంత్రం హఠాత్తుగా ఓ ట్వీట్ చేశారు. జనసేన పొత్తుల గురించి వార్తలు వస్తున్నాయని.. దానిపై స్పందన అన్నట్లుగా ఆ ట్వీట్ ఉంది. ” ఆ వార్తలు వింటుంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఆ పార్టీతో కలుస్తుంది ఈ పార్టీతో కలుస్తుందని అంటున్నారని సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని ఇంకొందరు అంటున్నారని జనసేనకు ఎవరిక అండదండలు అవసరం లేదని ”మన బలం జనం.. చూపిద్దాం ప్రభంజనం” అంటూ ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్. మొత్తానికి అసలు ట్వీట్‌ మంచి ప్రాసతో సాగింది కానీ అసలు ఏ రాష్ట్రం కోసం పెట్టారో అన్న క్లారిటీ కూడా ఉంటే ఆ డైలాగ్ పేలేది కానీ పవన్ ఆ సాహసం చేయలేదు.

Pawan Kalyan Comments On TDP AP Politics

అసలు ఈ ట్వీట్ తెలంగాణకు ఉద్దేశించి పెట్టినదా లేక ఏపీకా..? అన్నది మరలా క్వశ్చన్ మార్క్, ఎందుకంటే.. ముంగిట.. తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి. మరో పదిహేను రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. అప్పట్నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ తెలంగాణలో పోటీ విషయం మీద ఎటూ చెప్పలేదు. కొద్ది రోజుల కిందట కవాతు ముందు.. తనను కలిసిన తెలంగాణ కార్యకర్తలతో 16వ తేదీన ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి పంపించారు. పదహారు అయిపోయి ఆరు కూడా దగ్గరకొచ్చినా ఏ నిర్ణయం ప్రకటించలేదు. అసలు పోటీ చేస్తారా లేదా అన్న సస్పెన్స్ కంటిన్యూ చేస్తున్నారు. చేయకపోతే అదే విషయాన్ని చెప్పవచ్చు కదా. ఎందుకంటే పవన్ మీస్ద్ అనమ్మకంతో టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న కొంత మంది జనసేన అఫీసు చుట్టూతిరుగుతున్నారు. కానీ వారి ఆశల మీద నీళ్ళు చల్లేలా క్లారిటీ మాత్రం పవన్ ఇవ్వలేదు.

Janasena Chief Pawan Kalyan Fires On TDP Leaders