కెసిఆర్ మీద కసి తీర్చుకుంటున్న పవన్.

pawan kalyan targeting on kcr

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మీద ఈమధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో పొగడ్తలు కురిపించారో , ఒకప్పుడు ఆ ఇద్దరి మధ్య అంతకు మించిన మాటల తూటాలు పేలాయి. తాజాగా తెలంగాణాలో యాత్ర చేస్తున్న పవన్ కళ్యాణ్ మాట,తీరు చూస్తుంటే ఈయన కెసిఆర్ ని గానీ అధికార పార్టీని గానీ ఒక్క మాట కూడా అనబోరని తేలిపోయింది. అయినా కెసిఆర్ మీద పవన్ కసి తీర్చుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. పాత పగ ని తీర్చుకుంటున్నారని నిస్సందేహంగా అనుకోవచ్చు. అదెలా అంటారా …

తెలంగాణాలో కాస్త ముందస్తుగానే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అయితే ముఖ్యమంత్రి కెసిఆర్ ని గట్టిగా తూర్పారబట్టగలిగే ఏ ఒక్క అవకాశం ప్రత్యర్థి పార్టీలకు లేకుండా పోయింది. రేవంత్ లాంటి ఒకరిద్దరు నాయకులు కాస్త గట్టిగా మాట్లాడుతున్నా ఆ వ్యాఖ్యల లోగుట్టు తెలుసు కాబట్టి జనం వాటికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కోదండరాం , మందకృష్ణ లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో బయటకు అంటే ప్రజాక్షేత్రంలోకి రాకుండా కెసిఆర్ ఏదో రకంగా నిలవరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కెసిఆర్ ప్రత్యర్థులకు ఏ అంశం మీద కెసిఆర్ ని గట్టిగా కార్నర్ చేయాలో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వాళ్ళు అందరికీ ఇప్పుడు తెలంగాణాలో పవన్ కళ్యాణ్ యాత్ర ఓ పెద్ద అస్త్రం అయ్యింది.

తెలంగాణాలో వున్న పవన్ ఫాన్స్ తో పాటు సెటిలర్స్ మనసు దోచుకోడానికి ఈ యాత్రకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటుంది. అయితే ఆ లక్ష్యం మాట ఎలా వున్నా లేని సమస్య ఒకటి పుట్టుకొచ్చింది. ప్రజాసమస్యల మీద గళం ఎత్తుతున్న తెలంగాణ నాయకుల్ని నిర్బందిస్తూ , ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఆలోచనను వ్యతిరేకించిన పవన్ కి ఎలా అనుమతి ఇచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రచారం ఒక్కసారిగా ఊపు అందుకుంది. కాంగ్రెస్ ఒక్కటే గాకుండా కొందరు తటస్థుల్లోనూ అదే ఆలోచన. ఈ విమర్శల్ని తిప్పికొట్టడంలో తెరాస నాయకులు కూడా ఇబ్బందిపడుతున్నారు. అందుకే ఓ టీవీ ఛానల్ చర్చకు వచ్చిన ఆ పార్టీ నాయకుడు స్టూడియో నుంచి బయటకు వస్తూ కెసిఆర్ మీద పవన్ కసి తీర్చుకుంటున్నాడని కామెంట్ చేస్తూ బయటకు వెళ్లడం కనిపించింది.